అధికారం ఉన్నంతసేపు చంద్రబాబు చుట్టూ తిరిగారు: డొక్కా, జూపూడిపై మాజీమంత్రి జవహర్ విమర్శలు

02-10-2020 Fri 20:04
  • కులం పేరుతో ఎదగాలని చూస్తున్నారని వ్యాఖ్యలు
  • దళితులపై దాడుల పట్ల ఎందుకు మాట్లాడడంలేదన్న జవహర్
  • ఎందుకు మౌన మునుల్లా ఉన్నారంటూ ఆగ్రహం
KS Jawahar slams Dokka and Jupudi
టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన డొక్కా మాణిక్యవరప్రసాద్, జూపూడి ప్రభాకర్ రావులపై ఏపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ ధ్వజమెత్తారు. అధికారం ఉన్నంతకాలం చంద్రబాబు చుట్టూ తిరిగారని, ఇప్పుడు కులాన్ని అడ్డుపెట్టుకుని ఎదగాలని చూస్తున్నారని ఆరోపించారు. దళితులపై హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు జరిగినప్పుడు డొక్కా, జూపూడి ఎందుకు మౌన మునుల్లా ఉన్నారని జవహర్ ప్రశ్నించారు. వీరిద్దరూ రాజకీయ, ఆర్థిక ఆకాంక్షల కోసం పనిచేస్తూ దళిత మేధావులుగా మారారని విమర్శించారు.

డొక్కా ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన న్యాయ పట్టాపై సందేహం వస్తోందని అన్నారు. డొక్కా ఓ లాయర్ అయివుండి ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను సమర్థిస్తూ, న్యాయవ్యవస్థను తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు.