Niharika Konidela: కాబోయే భర్తతో కలిసి జిమ్ కు వచ్చిన కొణిదెల నిహారిక

Niharika Konidela with her fiancee Chaitanya snapped at gym
  • వెంకట చైతన్యను పెళ్లాడనున్న నిహారిక
  • రెండు నెలల్లో జరగనున్న పెళ్లి
  • కొంచెం బరువు పెరిగిన నిహారిక
సినీ నటి కొణిదెల నిహారిక త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. వెంకట చైతన్యను ఆమె పెళ్లాడబోతోంది. రెండు నెలల్లో వీరి పెళ్లి జరగనుంది. పెళ్లి నేపథ్యంలో నిహారిక కొత్త ప్రాజెక్టులను అంగీకరించలేదు.

మరోవైపు కరోనా నేపథ్యంలో గత ఆరు నెలల నుంచి ఇంటిపట్టునే ఉండటం వల్ల ఆమె కొంచెం బరువు పెరిగింది. దీంతో, బరువు తగ్గేందుకు ఆమె రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తోంది. ఈ సాయంత్రం తన కాబోయే భర్త చైతన్యతో కలిసి ఆమె జిమ్ కు వచ్చింది. జిమ్ వెలుపల తీసిన వీరిద్దరి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకు ముందు మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి ఆమె జిమ్ కు వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
Niharika Konidela
Marriage
Fiancee
Gym
Tollywood

More Telugu News