Allu Studios: అల్లు స్టూడియోస్ లాంచింగ్.. వీడియో ఇదిగో!

Video of Allu Studios launching
  • స్టూడియో రంగంలోకి అల్లు ఫ్యామిలీ
  • నిన్న లాంచ్ చేసిన కుటుంబ సభ్యులు
  • అల్లు రామలింగయ్యకు అంకితం చేస్తామని ప్రకటన
టాలీవుడ్ పై అల్లు ఫ్యామిలీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వారి 'గీతా ఆర్ట్స్'కు ఉండే బ్రాండ్ నేమ్ మూమూలుగా ఉండదు. ఇదే సమయంలో అగ్ర నటుడిగా అల్లు అర్జున్ తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తమ ఫ్యామిలీ బ్రాండ్ ను మరో మెట్టుపైకి తీసుకెళ్లేందుకు వారు స్టూడియో రంగంలోకి అడుగుపెట్టారు. నిన్న అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా... అల్లు స్టూడియోస్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ స్టూడియోని అల్లు రామలింగయ్యగారికి అంకితమిస్తున్నామని చెప్పారు. కాసేపటి క్రితం స్టూడియో లాంచింగ్ కు సంబంధించిన వీడియోను అల్లు స్టూడియోస్ ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
Allu Studios
Allu Family
Launch
Tollywood

More Telugu News