Raviteja: థియేటర్లలో విడుదలకు రెడీ అవుతున్న రెండు సినిమాలు!

Two films getting released in theaters next month
  • ఈ నెల 15 నుంచి థియేటర్లకు అనుమతి 
  • ఏభై శాతం సీటింగ్ తగ్గించి తెరచుకోవచ్చు
  • థియేటర్లకు రవితేజ 'క్రాక్', రామ్ 'రెడ్'       
మన తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు పలు సినిమాల ప్రదర్శనతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేవి. అలాంటిది కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల థియేటర్లన్నీ గత ఆరు నెలల నుంచీ మూతబడి, వెలవెలబోతున్నాయి. దాంతో నిర్మాణం పూర్తయి వున్న కొన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీ ద్వారా రిలీజ్ అయిపోయాయి. స్టార్ హీరోల సినిమాలు మాత్రం థియేటర్ల కోసం ఎదురుచూస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 5.0 ప్రకారం ఈ నెల 15 నుంచి థియేటర్లను తెరవవచ్చు. ప్రస్తుతమున్న సీటింగ్ కెపాసిటీలో ఏభై శాతం తగ్గించి, పూర్తి కొవిడ్ నిబంధనలతో థియేటర్లను తెరచుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో చిత్ర పరిశ్రమలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ముఖ్యంగా విడుదలకు రెడీగా వున్న చిత్రాల నిర్మాతలు, ఆయా చిత్రాల హీరోలు హ్యాపీగా ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నారు.

ఈ క్రమంలో ముందుగా తెలుగులో రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఒకటి రవితేజ హీరోగా  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'క్రాక్' చిత్రం కాగా.. మరొకటి రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన 'రెడ్' సినిమా. ఈ రెండూ కూడా కాస్త గ్యాప్ తో ఒక దాని తర్వాత ఒకటి వచ్చే నెల ప్రారంభంలో విడుదల కానున్నాయని తెలుస్తోంది.  
Raviteja
Ram
Gopichand Malineni
Kishor Tirumala

More Telugu News