Anupam Hazra: కరోనా వస్తే బెంగాల్ సీఎం ను ఆలింగనం చేసుకుంటానన్న బీజేపీ నేతకు కొవిడ్ పాజిటివ్!

West Bengal BJP leader Anupam Hazra tested corona positive
  • కరోనా రోగుల బాధలు సీఎం తెలుసుకోవాలన్న హజ్రా
  • అస్వస్థతకు గురైన బీజేపీ నేత
  • కరోనాతో కోల్ కతా ఆసుపత్రిలో చేరిక
ఇటీవలే బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితుడైన పశ్చిమ బెంగాల్ నేత అనుపమ్ హజ్రాకు కరోనా సోకింది. తనకు ఒంట్లో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో హజ్రాకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆ వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అనుపమ్ హజ్రా ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా రోగుల బాధలు ఏంటో సీఎం తెలుసుకోవాలని, తనకు కరోనా వస్తే నేరుగా వెళ్లి దీదీని ఆలింగనం చేసుకుంటానని, తద్వారా కరోనా రోగుల బాధలు ఎలా ఉంటాయో ఆమెకు తెలిసేలా చేస్తానని వ్యాఖ్యానించారు.

దాంతో హజ్రా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. కాషాయదళంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు హజ్రాకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో చికిత్స కోసం కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
Anupam Hazra
Corona Virus
Positive
BJP
Mamata Banerjee
West Bengal

More Telugu News