షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన కంగన

02-10-2020 Fri 15:43
  • రామోజీ ఫిలింసిటీలో షూటింగ్
  • 10 రోజుల పాటు చిత్రీకరణ
  • కంగన పర్యటనను గోప్యంగా ఉంచుతున్న అధికారులు
Bollywood actress Kangana Ranaut arrives Hyderabad for shooting
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హైదరాబాదులో అడుగుపెట్టారు. ఓ సినిమా చిత్రీకరణ కోసం ఆమె ఇక్కడికి వచ్చారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో 10 రోజుల పాటు జరగనుంది. కాగా, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కంగన పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచారు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటికి వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు.

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత కంగన వ్యాఖ్యలు అధికార శివసేనకు ఆగ్రహాన్ని తెప్పించాయి. వివాదాస్పద వ్యాఖ్యలకు ఆమె కేంద్ర బిందువుగా మారారు. మహారాష్ట్ర సర్కారుపైనా ఆమె వ్యాఖ్యలు చేయడంతో శివసేన వర్గాలు కంగనాపై యుద్ధం ప్రకటించాయి. ఈ క్రమంలో ముంబయిలో ఆమె కార్యాలయాన్ని కూల్చివేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుండడంతో ఆమెకు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.