Budda Venkanna: విజయసాయిరెడ్డి మాటలు వింటుంటే కరోనాతో మైండ్ దెబ్బతిన్నట్టు అనిపిస్తోంది: బుద్ధా

Budda opines Corona makes damage on Vijaysai Reddy mind
  • ట్విట్టర్ లో విజయసాయి, బుద్ధా మధ్య మాటల యుద్ధం
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 5 సీట్లేనంటూ బుద్ధా ట్వీట్
  • ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో వెల్లడించాలని డిమాండ్
ఇటీవల కాలంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు అధికమయ్యాయి. తాజాగా సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందించారు.

టీడీపీకి గత ఎన్నికల్లో 23 సీట్లు రావడం దేవుడి స్క్రిప్ట్ అనే విజయసాయిరెడ్డి ఇప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలను కొన్నాం అని ప్రకటిస్తున్నారని తెలిపారు. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచేది 5 సీట్లేనని ఫిక్సయినట్టే అంటూ వ్యాఖ్యానించారు.

విజయసాయిరెడ్డి మాటలు వింటుంటే కరోనా ఎఫెక్ట్ తో మైండ్ కూడా దెబ్బతిన్నట్టు అనిపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. తమ పార్టీలోకి రావాలంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలంటూ సిద్ధాంతాల గురించి మాట్లాడే వీసా రెడ్డి గారు ఇప్పటిరకు రాజీనామా చేయకుండానే పార్టీలో చేర్చుకున్న నలుగురు ఎమ్మెల్యేలను ఎంతపెట్టి కొన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Budda Venkanna
Vijay Sai Reddy
Corona Virus
Mind
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News