Melania Trump: అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఇకపై ఇంట్లోనే ఉంటాం: మెలానియా ట్రంప్

Melania Trump reacts after they got tested corona positive
  • ట్రంప్ దంపతులకు కరోనా
  • క్వారంటైన్ లోకి వెళుతున్నట్టు మెలానియా వెల్లడి
  • అందరూ సురక్షితంగా ఉండాలని పిలుపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కు కూడా కరోనా పాజిటివ్ అని తెలిసిందే. దీనిపై మెలానియా ట్విట్టర్ లో స్పందించారు. ప్రస్తుతం తమ ఆరోగ్య స్థితి బాగానే ఉందని, అయితే కరోనా పాజిటివ్ వచ్చిన ఇతర అమెరికన్ల లాగా తాము కూడా క్వారంటైన్ లోకి వెళుతున్నామని తెలిపారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నామని, ఇకపై ఇంట్లోనే ఉంటామని వివరించారు. అధ్యక్షుడు ట్రంప్ తో పాటు తాను కూడా క్వారంటైన్ లోకి వెళుతున్నట్టు మెలానియా వివరించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, అందరం కరోనా నుంచి సురక్షితంగా బయటపడతామని స్పష్టం చేశారు.

అమెరికాలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు ఎన్నో పర్యాయాలు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా చేయించుకున్న పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని తేలింది. ట్రంప్ ముఖ్య సలహాదారు హోప్ హిక్స్ కు కూడా పాజిటివ్ అని వచ్చింది. ఇటీవల ట్రంప్, హిక్స్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో కలిసి ప్రయాణించారు.
Melania Trump
Corona Virus
Positive
Donald Trump
USA

More Telugu News