Janvi Kapoor: నయనతార పాత్రలో జాన్వీ కపూర్?

Janvi Kapoor in a remake of Nayanatara flick
  • నయనతార నాయికగా 'కొలమావు కోకిల'
  • 'కోకో కోకిల'గా తెలుగులోకి అనువాదం
  • హిందీలోకి రీమేక్ చేసే ప్రయత్నాలు
ఒక భాష నుంచి మరో భాషలోకి సినిమాలు రీమేక్ అవడం మనం ఎప్పటి నుంచో చూస్తూనే వున్నాం. ఒక భాషలో బాగా హిట్టయిన సినిమాని భారీ ఆఫర్లు ఇచ్చి రీమేక్ హక్కులను చేజిక్కించుకుంటూ వుంటారు. గతంలో హిందీ నుంచి దక్షిణాది భాషల్లోకి బాగా రీమేక్స్ అవుతూ ఉండేవి. అయితే, ఇటీవలి కాలంలో దక్షిణాది చిత్రాలను హిందీలో బాగా రీమేక్ చేస్తుండడం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా బాగా హిట్టయిన తెలుగు, తమిళ భాషా చిత్రాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆమధ్య నయనతార నటించిన ఓ చిత్రాన్ని కూడా ఇప్పుడు బాలీవుడ్ లో పునర్నిర్మిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నయనతార కథానాయికగా వచ్చిన 'కొలమావు కోకిల' చిత్రం మంచి హిట్టయింది. ఈ చిత్రాన్ని 'కోకో కోకిల' పేరిట తెలుగులోకి కూడా అనువదించి రిలీజ్ చేశారు. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక నయనతార పాత్రను హిందీ వెర్షన్లో జాన్వీ కపూర్ పోషించనున్నట్టు సమాచారం. 'కొలమావు కోకిల'లో నయనతార పాత్ర పెర్ఫార్మెన్స్ తో కూడిన పాత్ర. ఆమెకు ఎంతో పేరు కూడా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఎదుగుతున్న జాన్వీకి కెరీర్ పరంగా ఇది ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.
Janvi Kapoor
Nayanatara
Bollywood

More Telugu News