Nara Lokesh: దళిత యువకుడు అజయ్‌ని కొట్టి చంపేశారు: నారా లోకేశ్

lokesh slams ap govt
  • అనారోగ్యంతో చనిపోయాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు
  • దళితులపై జగన్ గారి దమనకాండ పరాకాష్ఠకు చేరింది
  • వాస్తవాలు బయట పడతాయనే భయం
  • కుటుంబ సభ్యులు నోరువిప్పడానికి లేదని బెదిరించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'దళితులపై వైఎస్‌ జగన్ గారి దమనకాండ పరాకాష్ఠకు చేరింది. విచారణ అని పిలిచి విజయవాడ, కృష్ణలంకకు చెందిన దళిత యువకుడు అజయ్ ని కొట్టి చంపేశారు. అనారోగ్యంతో చనిపోయాడని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు' అని లోకేశ్ ఆరోపించారు.

'వాస్తవాలు బయట పడతాయనే  భయంతో కుటుంబ సభ్యులు నోరువిప్పడానికి లేదని బెదిరించారు. దుర్గ గుడి సభ్యురాలి కుమారుడికో న్యాయం, దళిత యువకుడికి ఒక న్యాయమా? అని లోకేశ్ ప్రశ్నించారు.

'మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపారు. ఇసుక అక్రమ రవాణాకి అడ్డొచ్చాడని వరప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేసారు. ఇప్పుడు విచారణ పేరుతో అజయ్ ని బలితీసుకున్నారు. అవి పోలీస్ స్టేషన్లా? లేక వైకాపా నాయకుల ఫ్యాక్షన్ డెన్లా?' అని లోకేశ్ నిలదీశారు.
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News