Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Anushka Shetty opens Twitter account
  • ట్విట్టర్ అకౌంట్ తెరచిన అనుష్క 
  • షూటింగ్ మొదలెడుతున్న రాజశేఖర్
  • నెగటివ్ రోల్స్ చేస్తానంటున్న యంగ్ హీరో
*  ప్రముఖ కథానాయిక అనుష్క అభిమానులతో టచ్ లో ఉండడం కోసం ట్విట్టర్ ఖాతాను తెరచింది. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ తెలియజేస్తూ, 'ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం నా ట్విట్టర్ అకౌంటును ఫాలో అవండి' అంటూ అభిమానులను పలకరించింది.  
*  ప్రముఖ నటుడు డా. రాజశేఖర్ తన తదుపరి చిత్రాన్ని నీలకంఠ దర్శకత్వంలో చేస్తున్నారు. రిచా పనై కథానాయికగా నటించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 7 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రాన్ని జీవిత రాజశేఖర్ నిర్మిస్తున్నారు.
*  నెగటివ్ రోల్స్ చేయడానికి తాను సిద్ధమంటున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. 'నాకు డిఫరెంట్ పాత్రలు చేయాలని వుంది. ఎవరైనా మంచి స్క్రిప్టులతో వస్తే చేయడానికి నేను రెడీ. 'వాలి' సినిమాలో అజిత్ చేసిన టైపు పాత్రలంటే చాలా ఇష్టం' అని చెప్పాడు. అన్నట్టు రాజ్ తరుణ్ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రం నిన్న 'ఆహా' ఓటీటీ ప్లేయర్ ద్వారా విడుదలైంది.
Anushka Shetty
Rajashekhar
Neelakantha
Rajtarun

More Telugu News