మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురి దుర్మరణం

01-10-2020 Thu 20:55
Fatal accident in Medak district
  • ఆటో, కారు ఢీ
  • ఘటన స్థలంలో ముగ్గురి మృతి
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరి మృతి

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో అప్పాజీపల్లి నుంచి మెదక్ వైపు వస్తుండగా, హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఎనిమిది మంది ప్రయాణికులున్నారు.

ముత్యాలు (46), సుమలత (25), శ్రీవర్షిణి (2) ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.