శివాజీ గణేశన్... ఈ అక్షరాలు అద్భుత నటనకి ప్రతిరూపం: చిరంజీవి

01-10-2020 Thu 19:40
Chiranjeevi remembers Sivaji Ganeshan on his birth anniversary
  • నేడు శివాజీ గణేశన్ జయంతి
  • తెరపైన గర్జించే విశ్వరూపం అంటూ చిరు ట్వీట్
  • ఆయన ప్రేమ చవిచూసినవాడ్ని అంటూ వ్యాఖ్యలు

దక్షిణాది నటదిగ్గజం శివాజీ గణేశన్ జయంతి సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. శివాజీ గణేశన్... ఈ అక్షరాలు అద్భుత నటనకి ప్రతిరూపం అంటూ కీర్తించారు. వెండితెరపైన గర్జించే ఆ విశ్వరూపం... నిజజీవితంలో ఆప్యాయతకి, ఆత్మీయతకు నిదర్శనం అని కొనియాడారు.

ఆయన ప్రేమ చవిచూసిన వాడ్ని, ఆయన నటనను అభిమానించిన వాడ్ని అంటూ చిరంజీవి భావోద్వేగభరిత ట్వీట్ చేశారు. లెజెండ్, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ ను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నాను అంటూ చిరు వ్యాఖ్యానించారు. అంతేకాదు, శివాజీ గణేశన్ తో తాను చిరునవ్వులు చిందిస్తున్న ఓ ఫొటోను కూడా పంచుకున్నారు.