ఐపీఎల్ 2020: ముంబయితో మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్

01-10-2020 Thu 19:25
KXIP has won the toss against Mumbai Indians
  • నేడు ఐపీఎల్ లో ముంబయి వర్సెస్ పంజాబ్
  • ఫామ్ కోసం పాండ్య బ్రదర్స్ తంటాలు
  • ఎం.అశ్విన్ స్థానంలో గౌతమ్ ను తీసుకున్న పంజాబ్

యూఏఈ ఆతిథ్యమిస్తున్న ఐపీఎల్ టోర్నీలో ఇవాళ ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పోరుకు అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా నిలుస్తుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు మూడేసి మ్యాచ్ లు ఆడాయి. రెండేసి మ్యాచ్ ల్లో ఓడిపోయి, ఒక్కో విజయం నమోదు చేసుకున్నాయి. దాంతో కింగ్స్, ముంబయి జట్లకు ఈ మ్యాచ్ గెలుపు అత్యావశ్యకం కానుంది.

ఆటగాళ్ల ప్రదర్శన విషయానికొస్తే, ముంబయి జట్టులో పాండ్య బ్రదర్స్ (హార్దిక్, కృనాల్) ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ మ్యాచ్ తో ఫామ్ లోకి రావాలని సోదరులిద్దరూ కోరుకుంటున్నారు. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే ముంబయి ఇండియన్స్ బరిలో దిగనుంది. అటు పంజాబ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. స్పిన్నర్ మురుగన్ అశ్విన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ తుది జట్టులోకి వచ్చాడు.