చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ 'చెక్'!

01-10-2020 Thu 18:16
Nithin latest film titled Check
  • కీర్తి సురేశ్ తో ప్రస్తుతం 'రంగ్ దే' చేస్తున్న నితిన్ 
  • చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తాజా చిత్రం
  • కథానాయికలుగా రకుల్, ప్రియా ప్రకాశ్ వరియర్  

యంగ్ హీరో నితిన్ ఇప్పుడు దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కీర్తి సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' చిత్రాన్ని చేస్తున్న నితిన్ త్వరలో హిందీ సినిమా 'అందాధూన్'ని రీమేక్ చేయనున్నాడు.

మరోపక్క చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు టైటిల్ పోస్టర్ ను కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. భవ్య క్రియేషన్స్ నిర్మించే ఈ చిత్రం పేరు 'చెక్'. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వరియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ రోజు సాయంకాలం 4.30కు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రం ప్రీ లుక్ తో పాటు టైటిల్ని రిలీజ్ చేశాడు. ఇక ఈ ప్రీ లుక్ పోస్టర్ లో చేతికి సంకెళ్లతో నితిన్ సీరియస్ లుక్ తో కనిపిస్తున్నాడు. అలాగే టైటిల్ కి తగ్గట్టుగా హీరో చదరంగం ఆడుతున్న వాతావరణాన్ని కూడా డిజైన్ చేశారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుందని తెలుస్తోంది.