ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 7 లక్షలు దాటిన కేసుల సంఖ్య!

01-10-2020 Thu 17:53
Corona case in AP crosses 7 lakhs
  • 24 గంటల్లో కొత్తగా 6,751 కేసుల నమోదు
  • కరోనాతో 41 మంది మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 57,858

ఏపీలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న ఒక్క రోజు 6,133 కేసులు నమోదు కాగా... గత 24 గంటల్లో 6,751 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరుకుంది. మరోవైపు గత 24 గంటల్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,869కి పెరిగింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,577 టెస్టులు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 57,858 యాక్టివ్ కేసులు ఉండగా... 6,36,508 మంది కోలుకున్నారు.