సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రికార్డు

01-10-2020 Thu 15:49
Hero Vijay Devarakonda records with nine million followers in Instagram
  • ఇన్ స్టాగ్రామ్ లో 9 మిలియన్ల ఫాలోవర్స్
  • దక్షిణాదిన మరే హీరోకు సాధ్యం కాని ఘనత
  • భారీ విజయాలతో క్రేజ్ పెంచుకుంటున్న విజయ్ దేవరకొండ

సక్సెస్ కు పర్యాయపదంలా నిలుస్తున్న విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో రికార్డు నెలకొల్పాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరే నటుడికి లేని విధంగా విజయ్ దేవరకొండకు ఇన్ స్టాగ్రామ్ లో 90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా 90 లక్షల మార్కును అందుకున్న విజయ్ దేవరకొండ రికార్డు నెలకొల్పాడు. అది కూడా విజయ్ ఎంతో తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించడం విశేషం.

పెళ్లిచూపులు చిత్రంతో సక్సెస్ రుచి చూసిన విజయ్... ఆ తర్వాత అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత వచ్చిన గీతగోవిందంతో స్టార్ డమ్ వచ్చింది. ప్రస్తుతం విజయ్ ఫైటర్ సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇందులో అనన్య పాండే హీరోయిన్.