ప్రభాస్ సినిమాలో నటిస్తోందన్న వార్తలపై అనుష్క స్పందన

01-10-2020 Thu 15:35
Anushka response on acting in Adipurush Movie
  • 'ఆదిపురుష్'లో సీత పాత్ర పోషిస్తోందంటూ వార్తలు
  • వట్టి పుకార్లు మాత్రమేనన్న అనుష్క
  • తనను ఎవరూ సంప్రదించలేదని వ్యాఖ్య

ప్రభాస్ తదుపరి చిత్రం 'ఆదిపురుష్' భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తుండగా... రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. మరోవైపు ఈ సినిమాలో సీత పాత్రను అనుష్క పోషించబోతోందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వార్తలపై అనుష్క స్పందించింది.

ఇవన్నీ పుకార్లు మాత్రమేనని అనుష్క చెప్పింది. ఈ చిత్రంలో తాను నటించబోతున్నాననే రూమర్లు ఎలా మొదలయ్యాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. 'ఆదిపురుష్' చిత్ర బృందం ఇంతవరకు తనను సంప్రదించలేదని చెప్పింది. ఒకవేళ అంత గొప్ప పాత్రలో నటించే అవకాశం తనకు వస్తే... తానే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపింది. ఇలాంటి పుకార్లను అభిమానులు నమ్మొద్దని విన్నవించింది.