Air India One: కాసేపట్లో ఢిల్లీలో ల్యాండ్ కానున్న ఎయిరిండియా వన్ విమానం!

  • భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కోసం ఎయిరిండియా వన్ విమానం
  • విమానాన్ని తయారు చేసిన బోయింగ్ సంస్థ
  • విమానాన్ని నడపనున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు
Air India One to arrive Delhi later today

భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించేందుకు తయారైన ఎయిరిండియా వన్ విమానం అమెరికా నుంచి ఇండియాకు ఈరోజు వస్తోంది. అత్యాధునిక రక్షణ సౌకర్యాలతో బోయింగ్ సంస్థ తన బీ777 ఎయిర్ క్రాఫ్ట్ ను ఎయిరిండియా వన్ గా రూపుదిద్దింది.

ఈ విమానాన్ని ఎయిర్ ఇండియాకు బోయింగ్ గత ఆగస్టులోనే అందించాల్సి ఉండగా... కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యమైంది. కాసేపట్లో ఈ విమానం ఢిల్లీలో ల్యాండ్ కానుంది. వీవీఐపీల ప్రయాణాల కోసం ఉద్దేశించిన మరో విమానం కొన్ని రోజుల తర్వాత అందనుంది.

ఈ రెండు విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు కాకుండా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు నడపనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడుపుతున్నారు. అంతేకాదు ఇతర సమయాల్లో వాటిని కమర్షియల్ ఆపరేషన్లకు కూడా వినియోగిస్తున్నారు. కానీ, ఈ ఎయిరిండియా విమానాలను మాత్రం భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పర్యటనలకు ఒకటి, వీవీఐపీల ప్రయాణాల కోసం మరొకటి ప్రత్యేకంగా వినియోగించనున్నారు.

More Telugu News