Prakash Raj: కుమారుడితో కలిసి మొక్కలు నాటి.. సెల్ఫీ తీసుకున్న ప్రకాశ్ రాజ్

prakashraaj  accepted GreenindiaChallenge
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రకాశ్
  • పలువురు నటులకు ఛాలెంజ్
  • సంతోష్‌ కుమార్‌కు కృతజ్ఞతలు
టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ దేశ వ్యాప్తంగా పాప్యులర్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో చాలా మంది ప్రముఖులు ఇందులో పాల్గొని మరికొందరికి సవాలు విసిరారు. తాజాగా సినీనటుడు ప్రకాశ్ రాజ్‌ ఈ సవాలును స్వీకరించి తన కుమారుడితో కలిసి మొక్కలు నాటారు.               
కాగా, ఇటీవల మొక్కలు నాటిన తనికెళ్ల భరణి.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి సుహాసిని, నటులు నాజర్, ప్రకాశ్‌ రాజ్‌లకు సవాలు విసిరి మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ కు తనికెళ్ల భరణి ధన్యవాదాలు తెలిపారు.  ఆయన సవాలును స్వీకరించి ప్రకాశ్‌ రాజ్‌ మొక్కలు నాటారు. మోహన్ లాల్, సూర్య, రోహిత్ శెట్టి, రమ్యకృష్ణ, త్రిషలకు ఆయన సవాలు విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Prakash Raj
Green India Challenge
Tollywood

More Telugu News