డియర్ ఫ్రెండ్స్.. ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైనది: కంగనా రనౌత్

01-10-2020 Thu 12:47
Today is speacial for me says Kangana Ranaut
  • ఏడు నెలల తర్వాత షూటింగులో పాల్గొంటున్నా
  • 'తలైవి' షూటింగ్ కోసం దక్షిణాదికి వచ్చా
  • ఈ సెల్ఫీలు ఉదయమే తీసుకున్నా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవలి కాలంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. మొన్నటి దాకా ఇండస్ట్రీలోని వ్యక్తులకు మాత్రమే చుక్కలు చూపించిన ఆమె... తాజాగా ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కూడా టార్గెట్ చేసింది.

ఇక ఈ వివాదాలన్నీ కొనసాగుతుండగానే... మరోవైపు షూటింగుల్లో బిజీ కాబోతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో కంగన నటిస్తోంది. కరోనా వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కంగన ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.

'డియర్ ఫ్రెండ్స్... ఈరోజు నాకు చాలా ప్రత్యేకం. ఏడు నెలల తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నా. 'తలైవి' ప్రాజెక్టులో పాల్గొనేందుకు దక్షిణాదికి వచ్చాను. ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సెల్ఫీలు ఉదయమే తీసుకున్నా. మీకు నచ్చుతాయనుకుంటా' అని ట్వీట్ చేసింది.