నిజమైన ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరు?: దేవినేని ఉమ

01-10-2020 Thu 12:40
devineni uma slams jagan
  • లక్నోలో 2000 కోట్ల రూపాయలతో లులు గ్రూప్ మాల్
  • విశాఖ బీచ్ రోడ్డులో దీనికంటే పెద్దమాల్ కోసం గతంలో ఒప్పందం
  • కక్షతో వైసీపీ రద్దు చేసింది
  • యువతకి 10 వేల ఉద్యోగాలు వచ్చేవి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్నోలో 2000 కోట్ల రూపాయలతో లులు గ్రూప్ నిర్మిస్తున్న మాల్‌కు సంబంధించిన ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఏపీలోనూ ఇటువంటి నిర్మాణాల కోసం తమ ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకుంటే వాటిని రద్దు చేశారని విమర్శలు గుప్పించారు.
                       
'ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో 2000 కోట్ల రూపాయలతో లులు గ్రూప్ నిర్మిస్తున్న మాల్. విశాఖ బీచ్ రోడ్డులో దీనికంటే పెద్దమాల్ హోటల్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ఒప్పందం చేసుకుంటే కక్షతో రద్దు చేశారు. శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖ యువతకి 10 వేల ఉద్యోగాలు వచ్చేవి. నిజమైన ఉత్తరాంధ్ర ద్రోహి ఎవరు? చెప్పండి వైఎస్ జగన్' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

బందరుపోర్టు గురించి దేవినేని ఉమ మరో ట్వీట్ చేస్తూ.. 'కాంగ్రెస్ హయాంలో నవయుగకు బందరుపోర్ట్, ఏళ్లతరబడి పూర్తికాని భూసేకరణ.. చంద్రబాబు హయాంలో భూసేకరణ కొలిక్కితెచ్చి పనులు ప్రారంభించాం. వైసీపీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్ట్ రద్దు.. ప్రభుత్వమే చేపడుతుందని ప్రకటన. "పొరుగు" ఆకాంక్షతో బందరులడ్డు గుటుక్కుమనిపిస్తున్న సంగతేంటో చెప్పండి జగన్' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.