Juhi Chawla: నా కెరీర్ మొదట్లో చేసిన సినిమాలను నా పిల్లలు అస్సలు చూడరు: జుహీచావ్లా

My kids dont like to watch my movies says Juhi Chawla
  • నా సినిమాలు చూసేందుకు వాళ్లు ఇబ్బందిపడతారు
  • రొమాంటిక్ సినిమాలు అస్సలు చూడరు
  • రొమాంటిక్ సీన్లు ఉన్నాయా అని ముందే అడుగుతారు
బాలీవుడ్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్లలో జూహీచావ్లా ఒకరు. మిస్ ఇండియాగా ఎంపికైన తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె... తన అందం, అభినయంతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. బాలీవుడ్ లో అగ్రనటులందరి సరసన నటించారు. దక్షిణాది సినిమాల్లో సైతం ఆమె నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన పిల్లల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన కూతురు జాహ్నవి, కొడుకు అర్జున్ తన సినిమాలు చూడటానికి ఇబ్బందిపడతారని జూహీచావ్లా తెలిపారు. తన కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాలనైతే అసలు చూడరని చెప్పారు. తాను నటించిన రొమాంటిక్ సినిమాలు చూడానికి అర్జున్ ఇష్టపడడని.. తన సినిమాను చూడాలనుకుంటే ముందుగానే అందులో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయా?  అని అడుగుతాడని తెలిపారు. అలాంటి సీన్లలో నిన్ను చూడలేనని చెపుతాడని వెల్లడించారు.
Juhi Chawla
Bollywood
Tollywood
Children

More Telugu News