నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. విచారణకు హాజరైన దర్శకుడు అనురాగ్‌ కశ్యప్

01-10-2020 Thu 11:16
 Anurag Kashyap reaches Versova Police station in Mumbai to appear before the police
  • అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ ఫిర్యాదు
  • దర్శకుడికి సమన్లు
  • ముంబైలోని వెర్సోవా పీఎస్‌కు వచ్చిన కశ్యప్ 

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై ఇటీవల నటి పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పింది. లైంగిక వేధింపులకు గురి చేసి, మరోవైపు ఆయన స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారని, ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

ఇటీవల ఆమె మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోష్యారికి కూడా ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికీ ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో అనురాగ్‌ కశ్యప్‌కు పోలీసులు సమన్లు పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అనురాగ్‌ కశ్యప్ ఈ రోజు ముంబైలోని వెర్సోవా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పోలీసులకు ఆయన ఈ కేసుపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, పాయల్‌ ఘోష్‌కు పలువురు సినీ ప్రముఖుల నుంచి మద్దతు వచ్చిన విషయం తెలిసిందే.