లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా నాదే: వర్మ

01-10-2020 Thu 10:55
CORONAVIRUS will be the FIRST FILM TO RELEASE AFTER LOCKDOWN
  • థియేటర్లు అక్టోబరు 15న తిరిగి ప్రారంభం
  • ఆ తర్వాత కరోనా సినిమా విడుదల
  • ట్రైలర్‌ను మరోసారి పోస్ట్ చేసిన వర్మ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. 'థియేటర్లు అక్టోబరు 15న తిరిగి ప్రారంభమవుతున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతోన్న తొలి సినిమా కరోనా వైరసేనని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను' అని వర్మ ట్వీట్ చేశారు. కాగా, దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా చోటు చేసుకున్న పరిణామాలను వర్మ ఈ సినిమాలో ఫన్నీగా చూపించనున్నట్లు తెలుస్తోంది.

ఇంట్లో కరోనా వైరస్ గురించి బాధపడడం, ఇంట్లోనూ భౌతిక దూరం పాటించడం వంటి సీన్లను వర్మ ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ చివరలో... తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనాపై చేసిన వ్యాఖ్యలను వినిపించారు. 'పారాసిటిమల్ వేసుకుంటే సరిపోతుంది' అని కేసీఆర్ అన్న వ్యాఖ్య ఇందులో ఉంది. ఆ తర్వాత, 'బ్లీచింగ్ పౌడర్‌ వేస్తే సరిపోతుంది' అంటూ ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యను కూడా ఇందులో వినిపించారు. ఈ ట్రైలర్‌ను వర్మ మరోసారి పోస్ట్ చేశారు.