క్యాచ్‌ పట్టి కిందపడ్డ సంజు.. అప్పట్లో సచిన్‌కీ ఇలాగే జరిగింది.. ఆ రెండు వీడియోలు ఇవిగో!

01-10-2020 Thu 09:52
sachin on sanju catch
  • నిన్న రాజస్థాన్, కోల్‌కతా మధ్య మ్యాచ్‌
  • 17వ ఓవర్‌లో సంజుకి గాయం
  • 1992 వరల్డ్ కప్‌లో సచిన్‌కు అచ్చం ఇలాగే గాయం
  • స్పందించిన టెండూల్కర్

ప్రస్తుతం కొనసాగుతోన్న ఐపీఎల్‌లో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటింగ్‌ చేస్తోన్న సమయంలో 17వ ఓవర్‌లో రాజస్థాన్‌ బౌలర్‌ టామ్‌ కరన్‌ వేసిన చివరి బంతిని ప్యాట్‌ కమిన్స్‌ డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లోకి బలంగా కొట్టడంతో బౌండరీలైన్‌ వద్ద సంజు శాంసన్ గాల్లోకి ఎగిరి బంతిని పట్టుకున్నాడు.

ఆ సమయంలో కింద పడడంతో అతడి తలకు స్వల్ప గాయమైంది. దీంతో ఆయనకైన గాయంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనే గతంలో టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ విషయంలోనూ జరిగింది

‌దీనిపై సచిన్ టెండూల్కర్‌ స్పందించారు. క్యాచ్‌ పట్టే సమయంలో వెనక్కి పడి తలకు దెబ్బతగిలితే ఆ నొప్పిని తట్టుకోలేమని చెప్పారు. అలాంటి బాధను తాను కూడా గతంలో ఎదుర్కొన్నట్లు తెలిపారు. 1992 వరల్డ్ ‌కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తనకు కూడా ఇలాంటి సంఘటన ఎదురైందని వివరించారు. నిన్నటి మ్యాచ్‌లో సంజు‌ పట్టిన క్యాచ్‌ అద్భుతమని అన్నారు. వీరి రెండు వీడియోలు చూడండి..