టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా డాక్టర్ శోభారాజు.. ఉత్తర్వులు జారీ

01-10-2020 Thu 07:59
Devotional Singer Shobha raju appointed as TTD musician
  • అన్నమాచార్య పాటను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేష కృషి
  • ఆమెను ఎంపిక చేస్తూ గతేడాది ప్రభుత్వానికి ప్రతిపాదన
  • రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్న డాక్టర్ శోభారాజు

టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంగీత కళాకారిణిగా అన్నమయ్య పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేష కృషి చేసిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజుకు అరుదైన గౌరవం లభించింది. ఆమెను టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా ప్రభుత్వం నియమించింది.

శోభారాజును ఎంపిక చేస్తూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యులు గతేడాది రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. పరిశీలించిన ప్రభుత్వం ఆమె నియామకాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. శోభారాజు రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.