సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ప్రియమణి పాన్ ఇండియా ఫిలిం
- వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ?
- షూటింగుకి రెడీ అవుతున్న రజనీకాంత్
* ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ త్వరలో బాలకృష్ణ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వుంది. ప్రస్తుతం చిరంజీవితో 'లూసిఫర్' రీమేక్ చేస్తున్న వినాయక్ ఇటీవల లాక్ డౌన్ సమయంలో బాలకృష్ణ కోసం ఓ కథను తయారుచేసుకుని ఆయనకు వినిపించాడని, అది బాలకృష్ణకు నచ్చిందని తెలుస్తోంది. పూర్తి స్క్రిప్టు తయారుచేసుకుని రమ్మని బాలయ్య చెప్పినట్టు సమాచారం.
* తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా షూటింగుకి రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగును ఈ నెల 15 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.