21 ఏళ్ల క్రితం ఇదే రోజున నా జీవితం మారిపోయింది: త్రిష

30-09-2020 Wed 21:30
My life has changed 21 years back on this same day says Trisha
  • 1999లో ఇదే రోజున మిస్ చెన్నై టైటిల్ గెలిచిన త్రిష
  • ఆనాటి ఫొటోను షేర్ చేసిన టాప్ హీరోయిన్
  • త్రిషకు అభినందనలు తెలుపుతున్న ఫ్యాన్స్

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావస్తున్నా త్రిష క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికీ టాప్ హీరోయిన్ గానే ఉంది. ఇరు భాషలకు చెందిన అగ్ర హీరోలందరి సరసన నటించింది. సినిమాల్లోకి రాకముందు సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజున త్రిష 'మిస్ చెన్నై' టైటిల్ గెలుచుకుంది. ఈ సందర్భంగా మిస్ చెన్నై కిరీటాన్ని ధరించిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది 30-09-1999న తన జీవితం మారిపోయిందని చెప్పింది. 'మిస్ చెన్నై 1999' అని కామెంట్ చేసింది. మరోవైపు త్రిషకు ఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.