ఎర్రబెల్లి మానవత్వం.. కరోనా పేషెంట్ల ఇంటికి వెళ్లి పరామర్శ!

30-09-2020 Wed 20:39
Errabelli went to corona patients home
  • కరోనాతో బాధపడుతున్న సర్పంచ్ దంపతులు
  • ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎర్రబెల్లి
  • ఏమీ కాదని ధైర్యం చెప్పిన మంత్రి

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానవత్వాన్ని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరోనా పేషెంట్ల పట్ల అభిమానంగా ఉండాలని అందరూ చెప్పడం చూస్తూనే ఉంటాం. కానీ ఎర్రబెల్లి దాన్ని చేతల్లో చేసి చూపించారు. నేరుగా కరోనా పేషెంట్లు ఉన్న ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు.

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు సర్పంచ్ వంగా పద్మావెంకటేశ్వర్లు దంపతుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. కరోనా వల్ల ఏమీ కాదని, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలని ధైర్యం చెప్పారు. మాస్క్ ధరించి వెళ్లిన ఎర్రబెల్లి వారికి కొంత దూరంలో నిలబడి మాట్లాడారు. కరోనాతో బాధపడుతున్న తమను పరామర్శించేందుకు వచ్చిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.