అఘోరి కథతో వెబ్ సిరీస్ ను నిర్మించనున్న ధోనీ

30-09-2020 Wed 19:26
  • సొంత ప్రొడక్షన్ హౌస్ ను నెలకొల్పిన ధోనీ
  • థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్టు తెలిపిన సాక్షి
  • సినిమా కంటే అద్భుతంగా ఉంటుందని వ్యాఖ్య
Dhoni to produce web series on Aghori
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఎంటర్ టైన్మెంట్ రంగంలో అడుగుపెట్టాడు. 'ధోనీ ఎంటర్ టైన్మెంట్' పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను నెలకొల్పాడు. ఈ సంస్థ ద్వారా గత ఏడాది ఒక డాక్యుమెంటరీని నిర్మించాడు.

తాజాగా ఓ వెబ్ సిరీస్ ను నిర్మించనున్నాడు. థ్రిల్లింగ్ అడ్వెంచర్ గా ఆ వెబ్ సిరీస్ ఉంటుందని ధోనీ భార్య సాక్షి తెలిపారు. ఇంకా ప్రచురితం కాని ఓ పుస్తకం ఆధారంగా దీన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. రహస్యంగా ఉన్న ఓ అఘోరి తన ప్రయాణాన్ని సాగించిన తీరు ఈ సిరీస్ లో ఉంటుందని తెలిపారు. ఆ అఘోరి వెల్లడించే రహస్యాలు మన నమ్మకాలను మార్చేస్తాయని చెప్పారు. సినిమా కంటే ఈ సిరీస్ అద్భుతంగా ఉంటుందని అన్నారు.