నేను బాగున్నా.. ఆందోళన అవసరం లేదు: వెంకయ్యనాయుడు

30-09-2020 Wed 18:13
I am recovering well says Venkaiah Naidu
  • కరోనా బారిన పడిన వెంకయ్యనాయుడు
  • హోమ్ ఐసొలేషన్ లో ఉన్న ఉపరాష్ట్రపతి
  • అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడి

భారత  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మరోవైపు ఆయన అర్ధాంగి ఉషకు నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆమె సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నారు. వెంకయ్యకు కరోనా అని తేలడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా సందేశాలను పంపుతున్నారు.

ఈ నేపథ్యంలో వెంకయ్య స్పందించారు. తాను బాగున్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీ అభిమానం తన హృదయాన్ని తాకిందని అన్నారు. వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మహమ్మారిని ఎదుర్కొంటున్నానని చెప్పారు.