అభిమానులకు నిరాశ.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న సెరెనా విలియమ్స్

30-09-2020 Wed 17:53
Serena Williams out of French Open
  • యూఎస్ ఓపెన్ లో సెరెనా కాలికి  గాయం
  • తగ్గకుండానే ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగిన వైనం
  • ఈ ఏడాది మరో టోర్నీలో కూడా ఆడబోనని వ్యాఖ్య

అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంది. యూఎస్ ఓపెన్ సెమీస్ లో ప్రపంచ నెంబర్ వన్ విక్టోరియా అజరెంకా చేతిలో సెరెనా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో తొలి రౌండ్ లో సెరెనా దూకుడుగా ఆడింది. ఆ తర్వాత ఆమె ఎడమకాలికి గాయమైంది. ఆ తర్వాత చురుకుగా కదలలేకపోయింది. ఆ గాయం నుంచి కోలుకోకుండానే ఫ్రెంచ్ ఓపెన్ లో ఆమె అడుగుపెట్టింది.

ఈ నేపథ్యంలో, ఆమె గాయం తిరగబెట్టింది. దీంతో, టోర్నీ నుంచి సెరెనా వైదొలగినట్టు నిర్వాహకులు ప్రకటించారు. మరోవైపు సెరెనా  మాట్లాడుతూ, ఆరు వారాలు రెస్ట్ తీసుకోకతప్పదని తెలిపింది. ఈ ఏడాది మరో టోర్నీని కూడా ఆడనని చెప్పింది.