ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు

30-09-2020 Wed 17:22
AP HC dismisses AB Venkatesara Rao petition
  • తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలంటూ ఏబీ పిటిషన్
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఓ కేసును రిఫరెన్స్ గా ఇచ్చిన హైకోర్టు
  • దాని ప్రకారం పిటిషన్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం

సెక్యూరిటీ పరికరాల కొనుగోళ్లలో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే సమయంలో కేసు నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ కేసును రిఫరెన్స్ గా ఇచ్చింది. ఆ ప్రకారం కేసు నమోదు చేయకుంటే కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేయాలని వెంకటేశ్వరరావుకు సూచించింది.

ఇజ్రాయెల్ నుంచి సెక్యూరిటీ పరికరాలను కొనుగోలు చేయడంలో నిబంధనలను ఉల్లంఘించారంటూ వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇవే ఆరోపణలతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఇటీవలే హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది.