Babri Masjid Case: బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పులో కీలకమైన ఐదు పాయింట్లు!

  • నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవు
  • సంఘ విద్రోహ శక్తులు మసీదును కూల్చేందుకు యత్నించాయి 
  • నాయకులు వారిని ఆపేందుకు యత్నించారు
Five key points in verdict of Babri masjid case

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈరోజు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కేసులో ముద్దాయిలుగా ఉన్నవారందరూ నిర్దోషులేనని జడ్జి ఎస్కే యాదవ్ తీర్పును ఇచ్చారు.

28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. కోర్టు తీర్పుతో బీజేపీ కీలక నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులంతా నిర్దోషులుగా తేలారు. యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ కేసు తీర్పును వెలువరిస్తున్న సందర్భంగా కోర్టు పేర్కొన్న ఐదు కీలక విషయాలు ఇవి.

  • బాబ్రీ మసీదు కూల్చివేత ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు.
  • నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవు.
  • సీబీఐ అందించిన వీడియో, ఆడియోల ప్రామాణికత్వాన్ని విశ్వసించలేము.
  • మసీదును కూల్చేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించగా... నిందితులుగా పేర్కొన్న నాయకులు వారిని ఆపేందుకు యత్నించారు.
  • ప్రసంగాల ఆడియో స్పష్టంగా లేదు.

More Telugu News