అదంతా నిజం కాదంటున్న మాధవన్!

30-09-2020 Wed 15:59
Madhavan says its not true
  • అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప' 
  • లాక్ డౌన్ కారణంగా ఆగిన షూటింగ్
  • విలన్ పాత్రలో మాధవన్ అంటూ ప్రచారం 
  • సోషల్ మీడియా ద్వారా ఖండించిన నటుడు  

'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా షూటింగు ఆగిపోయిన సినిమాలలో ఈ చిత్రం కూడా వుంది. లాక్ డౌన్ కి ముందు కేరళ అడవుల్లో కొంత షూటింగ్ చేశారు. అయితే, లాక్ డౌన్ విధించినప్పటి నుంచీ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక త్వరలో కేరళ అడవుల్లోనే మళ్లీ ఈ చిత్రం షూటింగును నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలావుంచితే, ఇందులో విలన్ పాత్రను ఫలానా నటుడు పోషిస్తాడంటూ మొదటి నుంచీ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆ క్రమంలో ప్రముఖ నటుడు మాధవన్ పేరు ఇటీవల వార్తలలోకి వచ్చింది. ఆయన ఏకంగా ఈ చిత్రానికి సంతకం కూడా చేసేశారంటూ వార్తలొచ్చాయి.

తాజాగా ఈ విషయం మాధవన్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఈ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని మాధవన్ షోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. దీంతో ఇక ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందనుకోవాలి.