Asaduddin Owaisi: భారతీయ న్యాయ వ్యవస్థలో ఈరోజు చీకటి రోజు: ఒవైసీ

  • బాబ్రీ మసీదు కేసు తీర్పుపై ఒవైసీ అసహనం
  • సీబీఐ కోర్టు తీర్పు బాధాకరమన్న ఒవైసీ
  • అందరూ నిర్దోషులైతే మసీదుని కూల్చింది ఎవరని ప్రశ్న
Today is a sad day in the history of Indian judiciary says Asaduddin Owaisi

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అభియోగాలను రుజువు చేసేందుకు సరైన సాక్ష్యాధారాలను సీబీఐ చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది.

మరోవైపు కోర్టు తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతీయ న్యాయవ్యవస్థకు ఈరోజు ఒక చీకటి రోజు అని అన్నారు. అయోధ్యలో వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ... చట్టాలను ఉల్లంఘించారని, పద్ధతి ప్రకారం ప్రార్థనా స్థలాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించిందని చెప్పారు.  

సీబీఐ కోర్టు తీర్పు బాధాకరమని అన్నారు. మసీదు  కూల్చివేత వెనక ఎలాంటి కుట్ర లేదని ఈరోజు కోర్టు తెలిపిందని అసహనం వ్యక్తం చేశారు. అందరూ నిర్దోషులైతే.. మరి మసీదును కూల్చింది ఎవరని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు దానంతట అదే కూలిపోయిందా? అని అడిగారు. మసీదును ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసిందని అన్నారు. 'మసీదును కూల్చండి' అని ఉమా భారతి నినాదాలు చేశారని చెప్పారు. ఈ తీర్పును వెలువరించడం కోసం ఎంత కాలం కసరత్తు చేశారని అన్నారు. ఈ తీర్పుపై సీబీఐ హైకోర్టుకు వెళ్లాలని చెప్పారు.

More Telugu News