జగన్ గారి నష్టపరిహారం పత్రికల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు: నారా లోకేశ్

30-09-2020 Wed 14:48
Help flood victims says Nara Lokesh
  • బురద రాజకీయాలు మానుకోండి
  • వరద బాధితులను ఆదుకోండి
  • అంచనా నివేదికలను త్వరగా పూర్తి చేయండి

భారీ వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్, వైసీపీపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బురద రాజకీయాలను మాని, ముందు వరద బాధితులను ఆదుకోవాలని అన్నారు. వరదల కారణంగా లంక గ్రామాలు మునిగిపోయాయని, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు.

రైతులు ఎంతో నష్టపోయారని... ప్రత్తి, మినుము, పసుపు, కంద, అరటి, మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ గారు చెబుతున్న నష్టపరిహార అంచనాలు, నష్టపరిహారం కేవలం పత్రికల్లో తప్ప, క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదని అన్నారు. అంచనా నివేదికలను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.