బాబ్రీ మసీదు కేసులో తీర్పుపై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు

30-09-2020 Wed 14:32
Prakash Raj responds on Babri case
  • కూల్చివేత కేసును హిట్ అండ్ రన్ కేసుతో పోల్చిన ప్రకాశ్ రాజ్
  • డ్రైవర్లను నిర్దోషులుగా ప్రకటించారని వ్యాఖ్య
  • న్యాయాన్ని భూస్థాపితం చేశారని విమర్శ

దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపుతిప్పిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ న్యాయస్థానం ఈరోజు సంచలన తీర్పును వెలువరించింది. సీబీఐ తన ఆరోపణలను నిరూపించలేకపోయిందని, నిందితులను దోషులుగా తేల్చేందుకు ఆధారాలు లేవని తేలుస్తూ.. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ కోర్టు తీర్పుపై విభిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు కోర్టు తీర్పును స్వాగతిస్తుండగా... మరికొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. న్యాయాన్ని భూస్థాపితం చేశారు. సరికొత్త  భారత్' అని ట్వీట్ చేశారు.