రాజ్ తరుణ్ తో హెబ్బా పటేల్ డేటింగ్ లో ఉందా?

30-09-2020 Wed 14:16
Hebah Patels speech stirs speculation
  • కొత్త చర్చకు తావిచ్చిన హెబ్బా వ్యాఖ్యలు
  • 90 శాతం రాజ్ తరుణ్ తో నటించాను
  • ఇప్పుడు కలిసే ఉంటున్నాం

రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా మాళవిక అయ్యర్ కూడా నటిస్తోంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మించారు. అక్టోబర్ 2న 'ఆహా'లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. తన కెరీర్లో 90 శాతం రాజ్ తరుణ్ తో కలిసే నటించానని చెప్పింది. ఇప్పుడు ఇద్దరం కలిసే ఉంటున్నామని తెలిపింది.