బాబ్రీ మసీదు కేసులో సీబీఐ కోర్టు తీర్పుపై అద్వానీ స్పందన!

30-09-2020 Wed 14:04
Lal Krishna Advani on Babri Demolition Verdict
  • బాబ్రీ కేసులో తీర్పును వెలువరించిన సీబీఐ కోర్టు
  • జై శ్రీరామ్ అంటూ అద్వానీ హర్షం   
  • తమ నిబద్ధతను తీర్పు ప్రతిబింబిస్తోందన్న అద్వానీ 

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ కోర్టు ఈరోజు తుది తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దాదాపు 28 సంవత్సరాల విచారణ అనంతరం తీర్పును వెలువరిస్తూ... ఈ కేసులోని నిందితులందరూ నిర్దోషులేనని ప్రకటించింది. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని, నిందితులు కుట్రకు పాల్పడ్డారనే ఆధారాలు లేవని కోర్టు తెలిపింది.

తమను నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో నిందితులలో ఒకరైన బీజేపీ కురువృద్ధుడు అద్వానీ స్పందిస్తూ, 'జై శ్రీరామ్' అంటూ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. రామజన్మభూమి ఉద్యమానికి సంబంధించి బీజేపీతో పాటు, తన వ్యక్తిగత నమ్మకాలను, నిబద్ధతను కోర్టు తీర్పు ప్రతిబింబిస్తోందని అన్నారు.