మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించాయి: కేటీఆర్ ఆగ్రహం

30-09-2020 Wed 13:13
ktr slams media
  • నవంబరులో ఎన్నికలు ఉంటాయని నేనన్నానని రాశారు
  • ఎన్నికల నేపథ్యంలో మా పార్టీకి సూచనలు మాత్రమే చేశాను
  • ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోది

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల తేదీలపై తాను వ్యాఖ్యలు చేయలేదని, తాను అనని మాటలను తనకు ఆపాదిస్తూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

'నవంబరులో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం నవంబర్ రెండవ వారం తరువాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక  పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది' అని చెప్పారు.

'ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం. సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది' అని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.