Japan: జపాన్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంబోధనపై కొత్త నిర్ణయం!

  • ప్రయాణికులకు లింగ, జాతి, ప్రాంతీయ భేదం లేని వాతావరణం 
  • ఇప్పటికే జపాన్ భాషలో పలు పదాల నిషేధం
  • ఇంగ్లిష్‌ భాషలోనూ అక్టోబరు 1 నుంచి బ్యాన్
ban on few word in japan

విమానాశ్రయాల్లో ప్రయాణికులకు స్వాగతం చెబుతూ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది 'లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్' అంటూ సంబోధించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, జపాన్‌లోని విమానాశ్రయాల్లో ఇకపై అలా పిలవబోరు. అక్కడి‌ ప్రభుత్వం.. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు లింగ, వయసు, జాతి, ప్రాంతీయ భేదం లేని వాతావరణం కల్పించాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ అందుకు అనుగుణంగా తాజాగా ఈ ప్రకటన చేసింది. స్త్రీ, పురుష లింగ భేదాన్ని ఎత్తిచూపే విధంగా లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్ పదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో వాటిని వాడబోమని తెలిపింది. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రయాణికులను 'ఎవ్రీవన్'‌ లేదా 'ఆల్‌ ప్యాసింజర్స్' అని మాత్రమే పిలవబోతున్నట్లు ఎయిర్‌ లైన్స్‌ అధికారులు ప్రకటించారు.

మరోవైపు, లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్ అని పిలవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కూడా తమ అధ్యయనంలో తేలిందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జపనీస్‌ భాషలో లింగభేదం చూపే పదాలను సైతం వాడడాన్ని బ్యాన్ చేశారు. లింగ భేదం తెలియకుండా ఇతర ప్రాంతాల్లో కస్టమర్స్ వంటి పదాలను మాత్రమే వాడుతున్నారు. సొంత జపనీస్ భాషలో ఇప్పటికే లింగ భేదం తెలిపే పదాలను బ్యాన్‌ చేశారు. వచ్చేనెల‌ 1వ తేదీ నుంచి ఇంగ్లిష్‌ భాషలోనూ లింగ భేదం వంటి పదాలు వాడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

More Telugu News