దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్‌

30-09-2020 Wed 10:10
purandeswari tests corona positive
  • ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం
  • కరోనా లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ పరీక్షలు
  • ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా సోకింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. ఆమెకు కొవిడ్‌-19 సోకిందని వైద్యులు గుర్తించారు.

అయితే, తనకు కరోనా సోకిన విషయంపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు ఆమె కాసేపటి క్రితం ట్వీట్ చేయడం గమనార్హం.