CAG: అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్.. 5 నెలల్లో రూ.47,130.90 కోట్ల అప్పు

Andhra Pradesh in a debt state
  • ఖర్చుపెడుతున్న ప్రతీ రూపాయిలో 55 పైసలు అప్పే
  • ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు ఆరు నెలల్లోనే
  • సమీకరించిన మొత్తంలో 55.7 శాతం రుణమేనన్న కాగ్
ఆంధ్రప్రదేశ్ క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పుగా తీసుకొచ్చినవేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చింది. ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు మొత్తాన్ని తీసుకుంది. ప్రభుత్వం గత ఐదు నెలల్లో వివిధ రూపాల్లో రూ. 84,617.23 కోట్లు సమీకరించగా, అందులో రూ. 47,130.90 కోట్ల రుణాలు ఉన్నాయి. అంటే మొత్తం సమీకరించిన మొత్తంలో 55.7 శాతం అప్పే.

కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, పన్నులు, పన్నేతర ఆదాయాలు తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. సెక్యూరిటీల వేలం, ఇతర అప్పుల రూపంలో ఈ ఏడాది రూ. 48,295.58 కోట్లు తీసుకోనున్నట్టు బడ్జెట్ అంచనాల సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆగస్టు నాటికే ఆ మొత్తాన్ని తీసేసుకున్నట్టు కాగ్ నివేదిక తెలిపింది.
CAG
Andhra Pradesh
Debits
YSRCP
YS Jagan

More Telugu News