ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ 

29-09-2020 Tue 22:45
Vice President Venkaiah Naidu tests positive for Covid19
  • ఈ రోజు ఉదయం కరోనా పరీక్ష చేయించుకున్న ఉపరాష్ట్రపతి
  • హోం క్వారంటైన్ లో వెంకయ్యనాయుడు
  • భార్య ఉషానాయుడుకు నెగటివ్

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ లో తెలిపింది. ఈ రోజు ఉదయం ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆయనను హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించినట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు ఎటువంటి లక్షణాలు లేవని తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా ఆయన భార్య ఉషానాయుడుకు మాత్రం టెస్టులో నెగటివ్ వచ్చినట్టు తెలిపారు. ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ లో తెలియజేసింది.