సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సివిల్స్ విజేతలు

29-09-2020 Tue 21:48
AP Civils winners met CM Jagan at camp office
  • ఇటీవల యూపీఎస్సీ ఫలితాలు
  • ఏపీ నుంచి పదిమంది విజేతలు
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ

ఇటీవల వచ్చిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఏపీకి చెందిన పది మంది మెరుగైన ర్యాంకులు సాధించారు. ఆ పదిమంది విజేతలు ఇవాళ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వారు సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

 ఈ సందర్భంగా వారిని సీఎం మనస్ఫూర్తిగా అభినందించారు. ఏ రాష్ట్ర క్యాడర్ లో పనిచేసినా ఏపీకి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ఉద్బోధించారు. వృత్తిలో రాణిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సివిల్స్ విజేతలతో ముఖ్యమంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.