Ramya Krishna: మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో రమ్యకృష్ణ?

Ramya Krishna to play key role in Chiranjivis flick
  • చిరంజీవి కథానాయకుడుగా 'లూసిఫర్' రీమేక్
  • ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్న వినాయక్
  • మంజు వరియర్ పోషించిన పాత్రలో రమ్యకృష్ణ  
  • వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం 
ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రశ్రేణి కథానాయికగా రాణిస్తూ.. అగ్ర హీరోలందరితోనూ కలసి నటించిన రమ్యకృష్ణ, ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంపిక చేసుకున్న చిత్రాలలో కీలకమైన పాత్రలు పోషిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించే ఓ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం.

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని ప్రస్తుతం చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మలయాళం వెర్షన్లో మంజు వరియర్ పోషించిన కీలకమైన పాత్ర ఒకటి వుంది. దీనికి పలువురిని పరిశీలించిన మీదట తాజాగా రమ్యకృష్ణను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట.

 ఎన్వీ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, గతంలో చిరంజీవితో 'ముగ్గురు మొనగాళ్లు', 'అల్లుడా మజాకా', 'ఇద్దరు మిత్రులు' వంటి చిత్రాలలో రమ్యకృష్ణ కథానాయికగా నటించిన సంగతి విదితమే.
Ramya Krishna
Chiranjeevi
VV Vinayak

More Telugu News