బిగ్ బాస్ కు అనుష్క గెస్ట్ గా రాకపోవడానికి ఇదే కారణమట!

29-09-2020 Tue 20:49
This is the the reason why Ahushka didnt come to Bigg Boss
  • కరోనా వల్ల రిస్క్ తీసుకోకూడదనే భావనలో అనుష్క
  • బిగ్ బాస్ కు వెళ్లకపోవడానికి కూడా కారణం ఇదే
  • 'నిశ్శబ్దం' సినిమాకు ఆన్ లైన్ లోనే ప్రమోషన్ చేస్తానన్న స్వీటీ

బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా కొనసాగుతోంది. ఎలిమినేషన్లు కూడా ప్రారంభం కావడంతో షోపై ఆసక్తి మరింత పెరిగింది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోకు గత వారాంతంలో గెస్ట్ గా సినీనటి అనుష్క వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఆమె రాకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తాను ఎందుకు రాలేదనే విషయంపై అనుష్క క్లారిటీ ఇచ్చింది.

కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని... మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని అనుష్క తెలిపింది. బిగ్ బాస్ లో పాల్గొనాలంటే అక్కడ ఎక్కువ మందిని కలవాల్సి ఉంటుంది. అందుకే బయటకు వెళ్లకూడదని ఆమె నిర్ణయించుకుంది. తన తాజా చిత్రం 'నిశ్శబ్దం' ప్రమోషన్ కోసం బిగ్ బాస్ కు ఆమె రావాల్సి ఉంది. అయితే, ఆన్ లైన్ లోనే తాను ప్రమోషన్ చేస్తానని ఆమె కండిషన్ పెట్టిందట.