ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. ఈనాటి అప్ డేట్స్

29-09-2020 Tue 19:49
6190 new Corona cases identified in Andhra Pradesh
  • రాష్ట్రంలో కొత్తగా 6,190 కొత్త కేసులు
  • 35 మంది కరోనాతో మృతి
  • 6,87,351కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య

ఏపీని వణికిస్తున్న కరోనా మహమ్మారి... కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో మొత్తం 68,429 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా... 6,190 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మరో 35 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఎనిమిది మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,87,351కి చేరుకోగా... 5,780 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 59,435 యాక్టివ్ కేసులు ఉన్నాయి.